Miss World: తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం: స్మితా సబర్వాల్

Smitha Sabharwal talks about Miss World contest

 


మే నెలలో మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఆమె మాట్లాడుతూ, తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందని, ఈ ప్రాంతానికి 2,500 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లలో ఎంతో వృద్ధి సాధించినట్లు చెప్పారు.

రామప్ప, వేయి స్తంభాల గుడి, చార్మినార్, గోల్కొండ కోటలాంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని అన్నారు. మెడికల్ టూరిజంలో తెలంగాణకు చాలా ప్రాముఖ్యత ఉందని గుర్తు చేశారు. సినిమా, ఆహార రంగాల్లో తెలంగాణ పెట్టింది పేరని స్మితా సబర్వాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News