Chandrababu Naidu: ఎమ్మెల్యేల కామెడీ స్కిట్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్విన చంద్రబాబు, పవన్... వీడియో ఇదిగో!

Hilarious AP MLAs Comedy Act Cracks Up Chandrababu and Pawan Kalyan

 


ఏపీ ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు ఆటల పోటీలు జరగడం తెలిసిందే. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన కామెడీ స్కిట్ చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ ఈశ్వరరావు పాడుతూ అభినయిస్తుంటే... చంద్రబాబు, పవన్ పడీపడీ నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆ ఎమ్మెల్యేలిద్దరినీ చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

More Telugu News