TFC: బెట్టింగ్ యాప్‌లకు నటీనటులు ప్రచారం చేయడంపై స్పందించిన టీఎఫ్‌సీసీ

TFC Condemns Celebrity Endorsements of Betting Apps

  • జీవన విధానం మారడం వల్ల ప్రచారాల్లో పాల్గొంటున్నారని వెల్లడి
  • కొంతమంది తెలిసి, ఇంకొంతమంది తెలియక ప్రమోషన్ చేస్తున్నారని వెల్లడి
  • ప్రమోషన్ చేసే నటీనటులపై చర్యలు తీసుకోవాలని 'మా'ను కోరతామన్న టీఎఫ్‌సీసీ

బెట్టింగ్ యాప్‌లకు నటీనటులు ప్రచారం చేయడంపై తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) స్పందించింది. నటీనటుల జీవన విధానం మారడం వల్ల బెట్టింగ్ యాప్‌లాంటి ప్రచారాల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. కొంతమంది తెలియక, మరికొంతమంది తెలిసి ప్రమోషన్ చేస్తున్నారని తెలిపింది.

ఈ మేరకు టీఎఫ్‌సీసీ ప్రకటన విడుదల చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ నిర్వహించే నటీనటులపై చర్యలు తీసుకోవాలని 'మా'ను కోరతామని, ఈ మేరకు రెండు రోజుల్లో లేఖను అందిస్తామని తెలిపింది.

సినిమా వారైనా, మరొకరైనా చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలని టీఎఫ్‌సీసీ పేర్కొంది. బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై రెండు రోజులుగా సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతున్నట్లు తెలిపారు. ఆ యాప్‌ల వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే ప్రమోషన్లు చేయడం తప్పే అవుతుందని స్పష్టం చేసింది.

TFC
Telangana Film Chamber of Commerce
Betting Apps
Celebrities
Film Industry
Promotions
Gambling
Social Impact
MA
Action
  • Loading...

More Telugu News