AP Assembly: కొన‌సాగుతున్న‌ ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు... కీలక కమిటీల ఏర్పాటు

AP Assembly Announces crucial committees

  • 2025-26 అసెంబ్లీ క‌మిటీల ప్ర‌క‌ట‌న‌
  • ఒక్కో క‌మిటీలో ఏడుగురు స‌భ్యులు
  • ఏడాదిపాటు ప‌నిచేయ‌నున్న క‌మిటీలు
  • అసెంబ్లీ రూల్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా అయ్య‌న్న‌పాత్రుడు
  • పిటిష‌న్ల క‌మిటీ ఛైర్మ‌న్‌గా ర‌ఘురామ‌కృష్ణంరాజు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతుండ‌గానే కీల‌క కమిటీల నియామకం చేపట్టారు. 2025-26 అసెంబ్లీ క‌మిటీలను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక్కో క‌మిటీలో ఏడుగురు స‌భ్యుల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క‌మిటీలు ఏడాదిపాటు ప‌నిచేయ‌నున్నాయి. 

అసెంబ్లీ రూల్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా అయ్య‌న్న‌పాత్రుడు, ప్ర‌భుత్వ హామీల క‌మిటీ ఛైర్మ‌న్‌గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ క‌మిటీ ఛైర్మ్‌గా మండ‌లి బుద్ధ‌ ప్ర‌సాద్‌, ప్రివిలేజెస్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా పితాని స‌త్య‌నారాయ‌ణ‌, పిటిష‌న్ల క‌మిటీ ఛైర్మ‌న్‌గా ర‌ఘురామ‌కృష్ణంరాజు మితులయ్యారు.   

More Telugu News