Nara Lokesh: మంత్రి లోకేశ్ చేతిలో జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీ... నెట్టింట వీడియో వైర‌ల్‌!

Jr NTR Flexi Held by Minister Lokesh Goes Viral

  • నిన్న కృష్ణా జిల్లా ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్‌ను ప్రారంభించిన‌ మంత్రి
  • నూజివీడు మండ‌లం సీతారాంపురం వ‌ద్ద ఆయ‌న‌కు టీడీపీ శ్రేణుల ఘ‌న స్వాగ‌తం
  • ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌లు, అభిమానుల కోరిక మేర‌కు తార‌క్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజ‌ప‌రిచిన లోకేశ్‌

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీని మంత్రి నారా లోకేశ్ ప్ర‌ద‌ర్శించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏపీలోని కృష్ణా జిల్లా మ‌ల్ల‌వ‌ల్లి ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్‌ను మంత్రి లోకేశ్ బుధ‌వారం ప్రారంభించారు. ఆ మార్గంలో నూజివీడు మండ‌లం సీతారాంపురం వ‌ద్ద ఆయ‌న‌కు టీడీపీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. 

ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌లు, అభిమానుల కోరిక మేర‌కు తార‌క్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజ‌ప‌రిచారు. దీంతో వారు కేరింత‌లు, ఈల‌ల‌తో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్ర‌త్య‌క్షం కావ‌డంతో వైర‌ల్‌గా మారింది. దీనిపై నందమూరి అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

More Telugu News