Sensex: భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

Sensex and Nifty Close with Huge Gains

  • 899 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 283 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ప్రధాన రంగాల షేర్ల విలువలో ఒక శాతం వృద్ధి

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ చివరికి సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 76,348 వద్ద ముగియగా.... నిఫ్టీ 283 పాయింట్ల లాభంతో 23.190 వద్ద స్థిరపడింది. 

ఇవాళ 2,296 షేర్లు లాభాలతో కళకళలాడగా... 1,554 షేర్లు నష్టపోయాయి. 124 షేర్ల విలువలో ఎలాంటి మార్పు లేదు. అన్ని ప్రధాన రంగాలకు చెందిన షేర్లు జోరుగా ట్రేడయ్యాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, టెలికాం షేర్లలో 1 శాతం పెరుగుదల నమోదైంది. 

ఎయిర్ టెల్, టైటాన్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల బాటలో పయనించగా... ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్ నష్టపోయాయి.

  • Loading...

More Telugu News