Elon Musk: భారత ప్రభుత్వంపై 'ఎక్స్' దావా... కారణమిదే!

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) భారత ప్రభుత్వంపై దావా వేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని, చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.