Upasana Konidela: ఆర్సీ16 సెట్స్ పై ఏం వండుతున్నారు?... జాన్వీ కపూర్ కు 'అత్తమ్మాస్ కిచెన్' కిట్ అందించిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, ఆమె అత్తగారు సురేఖ కొణిదెల జాయింట్ గా అత్తమ్మాస్ కిచెన్ పేరిట తెలుగు ఆహార ఉత్పత్తుల బిజినెస్ ప్రారంభించడం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్... బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16పేరిట ఓ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్.
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీకి అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఓ కిట్ బాక్స్ అందింది. ఈ బాక్స్ ను ఉపాసన స్వయంగా అందించడం విశేషం. రామ్ చరణ్, జాన్వీ, ఉపాసన ఆర్డర్ బుక్ చేస్తే... ఇవాళ డెలివరీ ఇచ్చినట్టు అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇంతకీ ఆర్సీ 16 సెట్స్ పై ఏం వండబోతున్నారు?... వేచి చూడండి! అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
