Vallabhaneni Vamsi: సీఐడీ కస్టడీకి వంశీ... ఆదేశాలు జారీ చేసిన కోర్టు

––
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈమేరకు విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో వంశీని ఏ-71 గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఆదేశాలతో వల్లభనేని వంశీని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.