Jack Movie: 'జాక్' నుంచి 'కిస్' లిరికల్ సాంగ్ వచ్చేసింది!

- సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’
- వైష్ణవి చైతన్య హీరోయిన్.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత
- భాగ్యనగరం అంతా.. అంటూ కిస్ కోసం సాగిన పాట
- సనారే రాయగా జావేద్ అలీ, అమల చేబోలు గాత్రం
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఓ పాట విడుదలయ్యాయి. తాజాగా కిస్ అంటూ సాగే మరో పాటను మేకర్స్ విడుదల చేశారు.
భాగ్యనగరం అంతా.. అంటూ ముద్దు కోసం సాగిన ఈ పాటను సనారే రాయగా జావేద్ అలీ, అమల చేబోలు ఆలపించారు. సురేష్ బొబ్బిలి బాణీలు అందించారు. కాగా, ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.