Sri Vishnu: ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజితో ఉద్యోగం

LPU Student Bags Rs 25 Crore Job Offer

  • రికార్డు స్థాయి వేతనాలతో ప్లేస్‌మెంట్లు సాధించిన ఎల్పీయూ విద్యార్ధులు
  • రెండున్నర కోట్ల వేతనంతో ఉద్యోగం పొందిన విష్ణు
  • కోటికిపైగా వేతనంతో ప్లేస్ మెంట్ సాధించిన నాగవంశీరెడ్డి

పంజాబ్‌లోని ప్రఖ్యాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు రికార్డు స్థాయి పారితోషికంతో ప్లేస్‌మెంట్స్ సాధించారు. ఇద్దరు విద్యార్థులు కోట్ల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు పొంది రికార్డు సృష్టించారు.

బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ విద్యార్థి శ్రీ విష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం పొంది రికార్డులకెక్కాడు. అలాగే బేతిరెడ్డి నాగ వంశీ రెడ్డి అనే విద్యార్థి రూ.1.03 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.

ఈ ఏడాది ఎల్పీయూ విద్యార్థుల్లో 1,700 మందికి పైగా పది లక్షల నుండి రెండున్నర కోట్ల ప్యాకేజీలను అందుకున్నారు. 1,912 మంది విద్యార్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగ ఆఫర్లను పొందారు. ప్రముఖ కంపెనీలైన పాలో అల్టో నెట్ వర్క్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్ఠాత్మక బహుళజాతి కంపెనీల నుండి విద్యార్థులు ప్లేస్‌మెంట్‌లు పొందారు.

ప్రవీణ్ కుంచల అనే విద్యార్థి కోటి రూపాయలు, ఎస్ అర్జున్ రూ.63 లక్షలు, అంజలి రూ.53 లక్షలు, నూకవరపు వంశీ రూ.51 లక్షలు, నజియా పర్వీన్ రూ.51 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించారు. 

  • Loading...

More Telugu News