Ayyanapathrudu: ఏపీ శాసన సభ్యులపై స్పీకర్ షాకింగ్ కామెంట్స్.. దొంగల్లా వచ్చి వెళ్తున్నారంటూ ఫైర్

AP Assembly Speakers Shocking Remarks on MLAs

  • రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని తీవ్ర ఆగ్రహం
  • ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఇలా చేయడమేంటని ఫైర్
  • గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఏడుగురు గాయబ్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేశాక అసెంబ్లీ నుంచి గాయబ్ అయిపోతున్నారని విమర్శించారు. రిజిస్టర్ లో సంతకం పెట్టిన పలువురు ఎమ్మెల్యేలు సభలో కనిపించడంలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి సభలో నుంచి వెళ్లిపోయారు.

దీనిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. తన దృష్టిలో ఆ ఎమ్మెల్యేలకు అంత అవసరంలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలుగా సభకు హాజరై మాట్లాడవచ్చని సూచించారు. ప్రశ్నలు అడిగిన సభ్యులు కూడా కొంతమంది సభలో నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నారని విమర్శించారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం చెప్పే జవాబు ఏంటని తెలుసుకోకుండా వెళ్లిపోతున్నారని చెప్పారు. ఇటువంటి సంప్రదాయం మంచిది కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆపై అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసిన తర్వాత సభలో కనిపించని ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లను స్పీకర్ చదివి వినిపించారు.

  • Loading...

More Telugu News