Tumma Vijay Kumar Reddy: ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు

- వచ్చే వారం విచారణకు రావాలంటూ..
- ఈ మెయిల్ ద్వారానే కాక హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి నోటీసులు
- నిబంధనలకు విరుద్దంగా వేల కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేశారన్న ఆరోపణలు
ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
వచ్చే వారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. నోటీసులను ఈ-మెయిల్ ద్వారా పంపడంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ అధికారులు పంపించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలో పని చేస్తున్నారు.