French Tourist: తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

French Tourist Assaulted in Tiruvannamalai

     


తమిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను సందర్శించారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలోని ఓ ప్రైవేటు ఆశ్రమంలో బస చేశారు. ఆలయం వెనుక ఉన్న కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తూ వచ్చేవారు. ఇందుకోసం గైడ్ సాయం తీసుకునేవారు. 

మూడు రోజుల క్రితం ఇలానే గైడ్ సాయంతో కొండపైకి వెళ్లి ధ్యానం చేసి వస్తుండగా గైడ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

  • Loading...

More Telugu News