Rajat Patidar: ఆర్సీబీ కొత్త కెప్టెన్‌పై రాబిన్ ఊతప్ప ఏమన్నాడంటే...!

- ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించనున్న రజత్ పటీదార్
- రజత్ కెప్టెన్సీపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప
- రజత్ పటీదార్ కు విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు ఉపయోగపడతాయని వ్యాఖ్య
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు రజత్ పటీదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఐపీఎల్‌లో సారథిగా బాధ్యతలు నిర్వహించడం రజత్ పటీదార్‌కు ఇదే తొలిసారి.
మరోవైపు అక్షర్ పటేల్ కూడా తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో రజత్ పటీదార్ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు.
అక్షర్ పటేల్, రజత్ పటీదార్.. ఈ ఇద్దరిలో పటేలే కెప్టెన్సీలో మెరుగ్గా రాణించగలడని, కానీ రజత్ పటీదార్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు ఉపయోగపడతాయని అన్నారు. పటీదార్ ఈ విషయంలో కోహ్లీపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉందని అన్నారు.