Stock Market: మళ్లీ లాభాల బాటలోకి స్టాక్ మార్కెట్లు.. మూడు రోజుల్లో 14 లక్షల కోట్ల లాభం!

Indian Stock Market Rebounds with Significant Gains

  • వరుస నష్టాలకు మార్కెట్లు బ్రేక్
  • వరుసగా మూడో రోజూ లాభపడిన మార్కెట్లు
  • నెల రోజుల తర్వాత తొలిసారి  రూ. 400 లక్షల కోట్ల మైలురాయిని దాటిన బీఎస్ఈ మార్కెట్ క్యాప్

కొన్ని రోజులుగా నష్టాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు తిరిగి గాడిన పడుతున్నాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ వరుసగా మూడో రోజు నిన్న లాభపడ్డాయి. మార్కెట్లు మళ్లీ పుంజుకుంటుండటంతో మదుపర్ల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. నిన్నటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకానొక దశలో 267 పాయింట్ల మేర పుంజుకున్నప్పటికీ, చివరికి 147.49 పాయింట్ల లాభంతో 75,449.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73.30 పాయింట్ల వృద్ధితో 22,907.60 వద్ద ముగిసింది.

కన్స్యూమర్ డ్యూరబుల్స్, కేపిటల్ గూడ్స్, రియల్టీ షేర్లలో మదుపరులు కొనుగోళ్లు పెంచడంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెడుతుండటంతో మార్కెట్లు పుంజుకున్నాయి. గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,620.14 పాయింట్లు (2.19 శాతం) పుంజుకోగా, మూడు రోజుల ర్యాలీలో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.13.82 లక్షల కోట్లు పెరిగి రూ. 405.01 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ. 400 లక్షల కోట్ల మైలురాయిని దాటడం నెల రోజుల తర్వాత ఇదే తొలిసారి. 

  • Loading...

More Telugu News