Nara Lokesh: అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh Minister Nara Lokesh Inaugurates Ashok Leyland Bus Plant

  • విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు కర్మాగారం ప్రారంభం
  • 75 ఎకరాల్లో ప్లాంట్... డీజిల్, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ.
  • రాష్ట్రానికి స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు రాక.
  • ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం.
  • పర్యావరణహిత రవాణాకు పెద్దపీట.

ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో అత్యాధునిక అశోక్ లేలాండ్ బస్సు తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని వెల్లడించారు. 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్మాగారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక మైలురాయి కానుందని లోకేశ్ పేర్కొన్నారు. ఇక్కడ డీజిల్ మరియు ఎలక్ట్రిక్ బస్సులు ఉత్పత్తి చేస్తారని.... అశోక్ లేలాండ్ ప్లాంట్ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని లోకేశ్ వెల్లడించారు. 

పర్యావరణ అనుకూల రవాణాకు ఊతమిస్తూ, ఆంధ్రప్రదేశ్ కోసం స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును స్వీకరించడం జరిగిందని... ఇది సుస్థిర రవాణా దిశగా ఒక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్ లేలాండ్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News