Gaddar Awards: గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

Apply for Gaddar Awards Deadline and Fees

  • రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడి
  • 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను స్వీకరణ
  • ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు రూ. 11,800

తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) గద్దర్ అవార్డుల దరఖాస్తులకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు వివరాలను వెల్లడించింది. 

గద్దర్ అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, బుక్స్-క్రిటిక్స్ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. 'ది మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్' పేరిట చెక్ లేదా డీడీ ద్వారా రుసుం చెల్లించాలని పేర్కొంది.

ఎంట్రీ, దరఖాస్తు రుసుం వివరాలు ఇలా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు రూ. 11,800, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ రూ. 3,450, బుక్స్ అండ్ క్రిటిక్స్ రూ. 2,360, అన్ని విభాగాల్లో అప్లికేషన్లకు ఫీజు జీఎస్టీతో కలిపి రూ. 5,900గా నిర్ణయించింది. పైన పేర్కొన్న ఎంట్రీ ఫీజులు జీఎస్టీతో కలిపి ఉన్నాయి.

  • Loading...

More Telugu News