Mohan Babu: 'కన్నప్ప' నుంచి 'గ్లింప్స్ ఆఫ్ మహాదేవ శాస్త్రి'... మోహన్ బాబు బర్త్ డే వేళ అభిమానులకు ట్రీట్

- మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప మూవీ
- మహాదేవ శాస్త్రిగా కీలక పాత్రలో మోహన్ బాబు
- నేడు మోహన్ బాబు పుట్టినరోజు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇవాళ పుట్టిన రోజు (మార్చ్ 19) జరుపుకుంటున్న సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి మహాదేవ శాస్త్రిని పరిచయం చేశారు. ఈ మేరకు మేకర్స్ ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. మహాదేవ శాస్త్రి పాత్ర కోసం మోహన్ బాబు ఎలా మేకోవర్ అయ్యారు? షూటింగ్ ఎలా జరిగింది? ఆ పాత్ర కోసం పడిన కష్టం ఏంటి? అని తెలియజేసేలా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్‌లో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, శంకర్ మహదేవన్ గాత్రం, స్టీఫెన్ దేవస్సీ బాణీ అద్భుతంగా ఉంది. మహాదేవ శాస్త్రి ఔనత్యాన్ని తెలియజేసేలా ఈ పాట ఉండబోతోందని అర్థం అవుతోంది. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్లు, పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతి త్వరలోనే కన్నప్ప ట్రైలర్‌ను రిలీజ్ చేసి మరింతగా అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉంది.