HYDRAA: హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Telangana High Court serious on HYDRAA

  • పేదల నిర్మాణాలు మాత్రమే కూల్చితే లాభం లేదని వెల్లడి
  • పెద్దల భవనాలు కూడా కూలిస్తేనే ప్రభుత్వ భూములు రక్షించినట్లు అన్న హైకోర్టు
  • చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్న హైకోర్టు

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెద్దల భవనాలు కూల్చినప్పుడే ప్రభుత్వ భూములు రక్షించినట్లు అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కేవలం పేదల నిర్మాణాలను కూల్చితే ప్రయోజనం లేదని పేర్కొంది.

మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దారు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దుర్గం చెరువు, మియాపూర్ చెరువులలోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది. 

చెరువుల పరిరక్షణ మంచిదేనని, కానీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని హైకోర్టు పేర్కొంది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News