Bhavana: విడాకుల వార్తలను కొట్టిపారేసిన ప్రముఖ నటి

- ఒంటరి, మహాత్మ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భావన
- భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం
- కొందరు దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
ఒంటరి, మహాత్మ వంటి చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి భావన వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై భావన స్పందించారు. తాను విడాకులు తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. తనపై కొందరు దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలేవీ పంచుకోనని, అందుకే తాను భర్తతో విడిపోతున్నానంటూ రాస్తున్నారని భావన పేర్కొన్నారు. తాను భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తున్నానని, తామిద్దరి ఫొటోలు పోస్టు చేస్తేనే కలిసి ఉన్నట్టా? అని ప్రశ్నించారు. ప్రైవసీకి విలువ ఇస్తూ తమ పర్సనల్ ఫొటోలు పోస్టు చేయనని వెల్లడించారు.