Spy Cameras: స్పై కెమెరాల అంశంపై విచారణ... విక్రయాలపై కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు

Telangana High Court Hearing on Spy Cameras

  • ఆన్‌లైన్, దుకాణాల్లో స్పై కెమెరాలు లభిస్తున్నాయన్న న్యాయవాది శ్రీరమ్య
  • స్పై కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఉండాలన్న న్యాయవాది
  • దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకునేలా చట్టాలు ఉన్నాయన్న కేంద్రం తరపు న్యాయవాది

మహిళా వసతి గృహాల్లో బాత్రూంలు, గదుల్లో స్పై కెమెరాలు దర్శనమిస్తున్న నేపథ్యంలో, వాటి విక్రయాలపై నియంత్రణ విధించాలని న్యాయవాది శ్రీరమ్య తెలంగాణ హైకోర్టును కోరారు.

స్పై కెమెరాల విక్రయాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ఆన్‌లైన్, దుకాణాల్లో స్పై కెమెరాలు సులభంగా లభ్యమవుతున్నాయని న్యాయవాది శ్రీరమ్య కోర్టుకు తెలియజేశారు.

స్పై కెమెరాలను దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయని కేంద్రం తరపు న్యాయవాది ముఖర్జీ కోర్టుకు తెలిపారు.

ప్రతి మొబైల్‌లోనూ కెమెరాలు ఉన్నందున వాటిని ఎలా నియంత్రించగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు.

మొబైల్ కెమెరాలను గుర్తించే అవకాశం ఉందని, కానీ స్పై కెమెరాలను రహస్యంగా అమర్చుతున్నారని శ్రీరమ్య కోర్టుకు తెలిపారు. కాబట్టి స్పై కెమెరాల విక్రయాలపై మార్గదర్శకాలు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే, ఈ విక్రయాలపై కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News