Kranthi Kiran: క్రేన్ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నేడు కూడా ఐటీ దాడులు!

తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడి గురించి తెలియని వారుండరు. అయితే, క్రేన్ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఐటీ దాడులు కొనసాగాయి. గుంటూరులోని క్రేన్ వక్కపొడి సంస్థ చైర్మన్ కాంతారావు నివాసంలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
40 కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.18 లక్షల నగదు సీజ్ చేసినట్టు సమాచారం. కాగా, ఐటీ అధికారులు గుంటూరులోని క్రేన్ వక్కపొడి ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.