Mohanlal: మార్చి 20న 'L2E: ఎంపురాన్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

L2E Empuraan Trailer Release Date Announced

  • మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో ఎల్2ఈ ఎంపురాన్
  • ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న విడుదల
  • తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్ విడుదల
  • తెలుగులో విడుదల చేస్తున్న దిల్‌రాజు

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తూ, మార్చి 20న మధ్యాహ్నం 1.08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ముంబైలోని ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్‌లో ‘L2E: ఎంపురాన్’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. మలయాళ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్ విడుదల కావడం విశేషం.

2019లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమా మూడు భాగాలుగా రానుండగా, ఇది రెండవ భాగం. మోహన్‌లాల్ ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. 

పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ గోపి కథను అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.

‘L2E: ఎంపురాన్’ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది. హిందీలో అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్, కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో గోకులం గోపాలన్ విడుదల చేస్తున్నారు.

Mohanlal
L2E Empuraan
Prithviraj Sukumaran
Malayalam Movie
Trailer Release
March 20
IMAX Trailer
Tovino Thomas
Dil Raju
Pan-Indian Release
  • Loading...

More Telugu News