Mohan Babu: మోహ‌న్ బాబు పుట్టిన‌రోజు... మంచు మ‌నోజ్ ఎమోష‌నల్‌ పోస్ట్‌!

Manchu Manojs Emotional Birthday Post for Mohan Babu

  • నేడు మోహ‌న్ బాబు పుట్టిన‌రోజు
  • తండ్రికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ మ‌నోజ్ ట్వీట్
  • మీతో క‌లిసి ఉండే క్ష‌ణాల కోసం ఎదురుచూస్తున్నా అంటూ భావోద్వేగ‌ పోస్ట్  

త‌న తండ్రి, న‌టుడు మోహ‌న్ బాబు పుట్టిన‌రోజు సందర్భంగా కుమారుడు మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టారు. తండ్రికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ మ‌నోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

"పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న‌. మ‌న‌మంతా క‌లిసి వేడుక‌ల‌ను చేసుకునే ఈరోజు మీ ప‌క్క‌న ఉండే అవ‌కాశాన్ని కోల్పోయాం. మీతో క‌లిసి ఉండే క్ష‌ణాల కోసం ఎదురుచూస్తున్నా. ల‌వ్ యూ" అంటూ మ‌నోజ్ భావోద్వేగ‌పూరిత పోస్ట్ పెట్టారు. దీనికి ఒక ఫొటోతో పాటు వీడియోను మ‌నోజ్ జోడించారు. 

ఇక‌ ఇటీవ‌ల మంచు కుటుంబంలో గొడ‌వ‌ల కార‌ణంగా మ‌నోజ్, మోహ‌న్ బాబు మధ్య దూరం పెరిగిన విష‌యం తెలిసిందే. ఈ వివాదాల నేప‌థ్యంలో మ‌నోజ్ పెట్టిన ఈ పోస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. 

More Telugu News