Bhavana: ఓటీటీ తెరపైకి మలయాళ హారర్ మూవీ!

Hunt Movie Update

  • మలయాళంలో రూపొందిన 'హంట్'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ నెల 28 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి   


క్రైమ్ థ్రిల్లర్ .. మర్డర్ మిస్టరీ జోనర్లకు సంబంధించిన కథలను మలయాళ దర్శకులు హ్యాండిల్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువలన ఆ తరహా సినిమాలు .. వెబ్ సిరీస్ లకి ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ హారర్ మూవీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'హంట్'. ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. 

అలాంటి  ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టనుంది. మనోరమ మ్యాక్స్ లో ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రెంజీ పణిక్కర్ .. అజ్మల్ అమీర్ .. చందూనాథ్ .. అనూ మోహన్ .. అదితి రవి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కైలాస్ మీనన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 

కథ విషయానికి వస్తే కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ హత్యకేసు సంబంధించిన పరిశోధనలో కీర్తి పాల్గొంటుంది. చాలాకాలం క్రితం హత్యచేయబడిన ఆ వ్యక్తి, డాక్టర్ సారా అని ఆమె తెలుసుకుంటుంది. అప్పటి నుంచి ఆమెకి అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సారా ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారు? సారా ఆత్మ ఆమెకి ఏం చెప్పాలనుకుంటోంది? అనేది కథ. 

  • Loading...

More Telugu News