IPL 2025: ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో మెరవనున్న బాలీవుడ్ స్టార్లు ఎవరంటే...!

- ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్
- కోల్ కతాలో కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్
- ఈ మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభ వేడుకలు
- ఈ వేడులకు సల్మాన్, షారుఖ్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో 18వ సీజన్‌కు తెరలేవనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయించాయి. ఈ మెగా ఈవెంట్‌లో బాలీవుడ్ బడా స్టార్లు మెరవనున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అలాగే ప్రముఖ సింగర్లు అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సంగీత ప్రదర్శనలు కూడా ఉంటాయని తెలుస్తోంది. పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా ప్రత్యేక షో చేయనున్నారని సమాచారం.
కాగా, ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 18వ సీజన్ మే 25 వరకు జరుగుతుంది. 65 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 25న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.