Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...!

- ఏడీఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు
- అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా పరాగ్ షా (మహారాష్ట్ర)
- పరాగ్ షా ఆస్తుల విలువ రూ.3,400 కోట్లు
- అత్యంత పేద ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా... ఆస్తి విలువ రూ.1700 మాత్రమే!
దేశంలో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరో తెలుసా? మహారాష్ట్రకు చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే పరాగ్ షా. ఆయన ఆస్తుల విలువ అక్షరాలా రూ. 3,400 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ADR దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,092 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించింది. దీని ఆధారంగా అత్యంత ధనవంతులైన, పేద ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది.
1. పరాగ్ షా (మహారాష్ట్ర, బీజేపీ): రూ. 3,400 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ముంబైలోని ఘాట్‌కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2. డీకే శివకుమార్ (కర్ణాటక, కాంగ్రెస్): కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ రూ. 1,413 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.
అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ. 1,700 మాత్రమే.
కాగా, సరైన పత్రాలు లేని కారణంగా 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను ADR విశ్లేషించలేకపోయింది. మరో 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ నివేదిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించే ఆస్తుల వివరాల ఆధారంగా ADR ఈ నివేదికను రూపొందించింది.