Marri Rajasekhar: మర్రి రాజశేఖర్ రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరిన బొత్స

- వైసీపీకి మరో దెబ్బ
- పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా
- ఐదుకి పెరిగిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక వైసీపీ నుంచి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. జగన్ నాయకత్వంలోని వైసీపీ నుంచి తాజాగా మరో వికెట్ పడింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
దీనిపై శాసనమండలిలో విపక్షనేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని మర్రి రాజశేఖర్ ను కోరారు. అయితే మర్రి రాజశేఖర్... బొత్స విజ్ఞప్తికి స్పందించలేదని తెలుస్తోంది.
వైసీపీకి ఇటీవల కాలంలో నలుగురు ఎమ్మెల్సీలు దూరమయ్యారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఆ సంఖ్య ఐదుకి పెరిగింది. పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణచక్రవర్తి, కర్రి పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేయడం తెలిసిందే.
చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి విడదల రజనిని నియమించడం పట్ల మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రజని నియామకం తర్వాత మర్రి రాజశేఖర్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.