Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్ల‌మెంట్‌ లో గౌరవ సన్మానం... వివరాలు ఇవిగో!

Chiranjeevi will be Honored at UK Parliament

  • చిరంజీవికి యూకే చట్టసభలో గౌరవ సత్కారం
  • ఇతర ఎంపీల సమక్షంలో సత్కరించనున్న బ్రిటన్ ఎంపీ నవేందు మిశ్రా
  • లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందించనున్న బ్రిడ్జ్ ఇండియా సంస్థ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, బ్రిటన్ కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా... చిరంజీవిని ఇతర ఎంపీల సమక్షంలో మార్చి 19న స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనుంది.

బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో  వారిని సత్కరిస్తుంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండ‌టం విశేషం. ఇది ఆయ‌న కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలుస్తుంది.

యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వ‌టం అనేది ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం.

2024లో భార‌త ప్ర‌భుత్వం నుంచి రెండో అత్యున్న‌త‌ పౌర పుర‌స్కారం పద్మ విభూష‌ణ్‌ ను చిరంజీవి గారు అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో సత్కరించబడ్డారు. ఎ.ఎన్‌.ఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.

Chiranjeevi
UK Parliament
British Parliament
Lifetime Achievement Award
Bridge India
Navendu Mishra
Cultural Leadership
Padma Vibhushan
Guinness World Record
ANR National Award
  • Loading...

More Telugu News