New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

Delhi stands as most poluted city

  • మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో ఎక్కువ కాలుష్యం
  • జాబితాలో దక్షిణాది నగరాలు
  • రెండో అత్యంత కాలుష్య నగరంగా కోల్‌కతా

దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. అధిక కాలుష్య నగరాల్లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా ఉన్నాయి. 2024-25 శీతాకాలంలో ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే, ఢిల్లీలో గాలి నాణ్యత గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెరుగ్గా ఉంది. గత ఏడాది ఇదే శీతకాలం సమయంలో పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 189 మైక్రోగ్రాములుగా రికార్డయింది.

ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా దేశంలో రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో పీఎం 2.5 సగటు స్థాయి క్యూబిక్ మీటర్‌కు 65 మైక్రోగ్రాములుగా నమోదైంది.

ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో కాలుష్యం గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలో వెల్లడయ్యాయి. చెన్నై, హైదరాబాద్‌లో అలాగే ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌లో పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 52 మైక్రోగ్రాములు, ముంబైలో 50, బెంగళూరులో 37, చెన్నైలో 36 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా నివేదిక తెలిపింది.

New Delhi
Pollution
India
  • Loading...

More Telugu News