Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...?

- ప్రజల ఉసురు తీస్తున్న బెట్టింగ్ యాప్ లు
- బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేస్తున్న యూట్యూబర్లపై కేసులు
- జీత్ విన్ అనే యాప్ కు నిధి అగర్వాల్ ప్రచారం
- సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు
డబ్బుకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ మాయలో పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తెలిసిందే. అయితే, బాధ్యతగా ఉండాల్సిన యూట్యూబర్లు, ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తుండడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి.
కాగా, ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా 'జీత్ విన్' అనే యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇది కూడా బెట్టింగ్ యాప్ అని, నిధి అగర్వాల్ ప్రమోట్ చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మరి, అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.