Mallu Bhatti Vikramarka: రేపు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి విక్రమార్క

- ఉదయం గం.11.14 నిమిషాలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న భట్టి
- రూ. 3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం
- మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.14 గంటలకు శాసనసభలో భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్. సుమారు రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది.