Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు

Vijay Sai Reddy Summoned Again by CID in Kakinada Sea Port Case

  • కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో విజయసాయిపై కేసు
  • కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలు బదిలీ చేసుకున్నట్టు ఆరోపణలు
  • ఈ కేసులో ఏ2గా విజయసాయి
  • గత బుధవారం ఓసారి విజయసాయిని విచారించిన సీఐడీ అధికారులు
  • ఈ నెల 25న మరోసారి రావాలంటూ తాజాగా నోటీసులు

కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయసాయిని సీఐడీ అధికారులు ఓసారి ప్రశ్నించారు. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు. మార్చి 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఆ సమయంలోనే విజయసాయికి సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. 

కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు ఫిర్యాదుతో నమోదైన కేసులో విజయసాయి, మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. ఇందులో విజయసాయి ఏ2గా ఉన్నారు.

  • Loading...

More Telugu News