Ranya Rao: బంగారం అక్రమ రవాణాలో రన్యా రావుది ప్రధాన పాత్ర: డీఆర్ఐ అధికారులు

DRI officials reveal about Ranya Rao

  • ఈ కేసులో మరో నిందితుడు తరుణ్ రాజ్ ఆమెకు స్నేహితుడని వెల్లడి
  • 2023 నుండి వీరు వ్యాపార భాగస్వాములుగా ఉన్నట్లు వెల్లడి
  • దుబాయ్‌లోని బ్యాంకు ఖాతాల ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్న అధికారులు

బంగారం అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా కన్నడ నటి రన్యా రావు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తెలిపారు. ఈ కేసు గురించి అధికారులు కీలక విషయాలు వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ కేసులో తనను ఇరికించారని, తనకేమీ తెలియదని రన్యా రావు తొలుత చెప్పారని, కానీ దర్యాప్తులో అక్రమ రవాణాలో ఆమె పాత్రను గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడైన హోటల్ వ్యాపారి తరుణ్ రాజ్ ఆమెకు స్నేహితుడని వెల్లడించారు. వీరిద్దరు కలిసి 2023లో దుబాయ్‌లో విరా డైమండ్ ట్రేడింగ్ ఎల్ఎల్‌సీ అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారని, అప్పటి నుంచి భాగస్వాములుగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

బ్యాంకాక్, జెనీవాలోని ప్రముఖ బంగారం వ్యాపారులతో వీరికి సత్సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి బంగారు కడ్డీలను కొనుగోలు చేసి దుబాయ్ ఖాతాల ద్వారా విదేశీ కరెన్సీలో డబ్బులు చెల్లించేవారని వెల్లడించారు. దుబాయ్‌లోని బ్యాంకు ఖాతాల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. బంగారం స్మగ్లింగ్‌లో రన్యా రావు సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను కూడా విచారిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News