Pawan Kalyan: ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని పవన్ ను అడిగిన బొత్స

అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటో షూట్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గ్రూప్ ఫొటో దిగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను... "ఎలా ఉన్నారు?" అని బొత్స పలకరించారు. కాసేపటి తర్వాత పవన్ ను మరోసారి కలిసి మాట్లాడారు.
ఢిల్లీ నుంచి వచ్చాక అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని ఈ సందర్భంగా బొత్స అడిగారు. కొల్లేరులో అటవీశాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల డెలిగేషన్ వచ్చి మిమ్మల్ని కలుస్తుందని చెప్పారు. దీంతో, అసెంబ్లీకి ఎప్పుడు వచ్చేది చెబుతానని పవన్ అన్నారు.
సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఈ నెల 9 నుంచి అటవీశాఖ సర్వే చేస్తోందని... మూడు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. రేపు సుప్రీంకోర్టులో కొల్లేరు వ్యాజ్యంపై విచారణ జరగనుందని... దీంతో సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఆందోళన నెలకొందని బొత్స చెప్పారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సమయం ఇస్తామని బొత్సకు పవన్ తెలిపారు.