IPL 2025: ఐపీఎల్ 2025లో అత్యధిక, అత్యల్ప జీతమున్న కెప్టెన్లు ఎవరో తెలుసా?

- మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్-2025 ప్రారంభం
- ఈ నేపథ్యంలో కెప్టెన్ల జీతాలపై నెట్టింట చర్చ
- అత్యధికంగా ఎల్ఎస్‌జీ సారథి పంత్‌కు రూ. 27 కోట్ల జీతం
- అత్యల్పంగా కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానెకు రూ. 1.5 కోట్లు
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్-2025 ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానుండగా కెప్టెన్ల జీతాలపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
ఇక ఈ సీజన్‌లో అత్యధికంగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) సారథి రిషభ్ పంత్ రూ. 27 కోట్లు జీతంగా పొందనున్నాడు. అలాగే అత్యల్పంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానె రూ. 1.5 కోట్లు అందుకోనున్నాడు.
పంత్ తర్వాత వరుసగా శ్రేయాస్ అయ్యర్(పంజాబ్ కింగ్స్) - రూ. 26.75 కోట్లు పాట్ కమిన్స్(సన్‌రైజర్స్ హైదరాబాద్) - రూ. 18 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్)- రూ. 18 కోట్లు, సంజు శాంసన్(రాజస్థాన్ రాయల్స్)- రూ. 18 కోట్లు, అక్షర్ పటేల్(ఢిల్లీ క్యాపిటల్స్)- రూ. 16.5 కోట్లు, శుభమన్ గిల్(గుజరాత్ టైటాన్స్) - రూ. 16.5 కోట్లు, హార్దిక్ పాండ్యా (ముంబయి ఇండియన్స్)- రూ.16.35 కోట్లు రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- రూ. 11 కోట్లు ఉన్నారు.