Victoria Helvig: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా

మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ విశిష్ఠతను తెలుసుకున్న విక్టోరియా, ఆలయ సందర్శన అనిర్వచనీయమని అన్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ దర్శించుకున్నారు. మిస్ యూనివర్స్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకు సంబంధించిన దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం అనంతరం ఆమెకు శ్రీవారి ఫొటో, ప్రసాదాన్ని అందించారు.
యాదగిరిగుట్ట ఆలయ విశిష్ఠతను, ఆలయ సంప్రదాయం సహా పలు వివరాలను విక్టోరియా అడిగి తెలుసుకున్నారు. ఈవో భాస్కర్ రావు ఆలయ విశిష్ఠతను మిస్ యూనివర్స్‌కు వివరించారు. అఖండ దీపారాధన చేసిన విక్టోరియా హెల్విగ్, ఆ తర్వాత మాట్లాడుతూ, ఆలయ సందర్శన అనిర్వచనీయమని పేర్కొన్నారు.