Chandrababu Naidu: అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం... చంద్రబాబు, పవన్ మధ్య సరదా క్షణాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, సరదాగా గడిపారు.
అరకు కాఫీకి విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. ఇప్పటికే పార్లమెంటులో అరకు కాఫీ కేఫ్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. తాజాగా, ఏపీ అసెంబ్లీ ఆవరణలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సరదా క్షణాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు స్వయంగా కాఫీ కప్ అందించగా... పవన్ చిరునవ్వుతో స్వీకరించారు. చంద్రబాబు తదితరులు ఈ స్టాల్ లో ఉంచిన పలు అరకు కాఫీ ఉత్పత్తులను కూడా ఆసక్తిగా పరిశీలించారు.




