Alleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

BJP MLAs protest at Assembly premises

  • పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన
  • అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • నిరసనలో పాల్గొన్న పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ సూర్యనారాయణ

తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ సూర్యనారాయణ తదితరులు నిరసన తెలిపారు.

మంగళవారం ఉదయం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అసెంబ్లీ వద్దకు తీసుకువచ్చారు. 

తమ ఎమ్మెల్యేలను బెదరగొడుతున్నారని బీజేపీ ట్వీట్

అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను బెదరగొట్టే విఫలయత్నంలో భాగంగా అసెంబ్లీ సమావేశానికి వస్తున్న మహేశ్వర్ రెడ్డిని అసెంబ్లీకి రానివ్వకుండా నిర్బంధించి, పోలీసు వాహనంలో నగరం చుట్టూ చక్కర్లు తిప్పారని బీజేపీ 'ఎక్స్' వేదికగా రాసుకొచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే ఇక కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలంగాణ సమాజం ఆలోచించాలని పేర్కొంది. ఇదేనా మీ రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్ కీ దుకాణ్? అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. ప్రజల పక్షాన పోరాడుతూ, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారని పేర్కొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనాన్ని బట్టబయలు చేస్తూ ఊపిరాడనివ్వకుండా చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుంటే, వారికి మాట్లాడే సమయం ఇవ్వకుంటే తమ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత పోతుందని భావిస్తున్నట్లుగా ఉందని పేర్కొంది. ఇలాంటి పిట్ట బెదిరింపులకు బీజేపీ నాయకులు భయపడుతారని అనుకోవడం కాంగ్రెస్ వెర్రితనమని పేర్కొంది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బీజేపీ నాయకులు ఎండగడుతూనే ఉంటారని పేర్కొంది.

  • Loading...

More Telugu News