Komatireddy Venkat Reddy: 'ఆర్ఆర్ఆర్' గురించి కీలక అప్డేట్ ఇచ్చిన కోమటిరెడ్డి

RRR works will be started in two months

  • రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభించేందుకు గడ్కరీ హామీ ఇచ్చారన్న కోమటిరెడ్డి
  • మూడున్నర నుంచి నాలుగేళ్లలో పనులు పూర్తి చేస్తామని వెల్లడి
  • ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్య

హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో చర్చలు జరిపానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్ మెంట్ పూర్తి చేసి పంపుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. 

రెండు నెలల్లో పనులు ప్రారంభించేందుకు గడ్కరీ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. మూడున్నర నుంచి నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ గురించి గడ్కరీని ఏడుసార్లు కలిశానని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాదిరి రోడ్లను అమ్ముకునే అలవాటు తమకు లేదని చెప్పారు. 

ఆర్ఆర్ఆర్ భూసేకరణకు ప్రజలు సహకరించాలని కోమటిరెడ్డి కోరారు. మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు చేస్తామని తెలిపారు. అధికారులపై దాడులు చేయించి అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు.

  • Loading...

More Telugu News