Mahesh Babu Foundation: మహేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆపరేషన్స్ పూర్తి.. ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఈ సంఖ్య సోమవారంతో 4,500 దాటినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న సమాజ సేవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అటు మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.