Posani Krishna Murali: సీఐడీ కస్టడీకి పోసాని

CID Police Took Posani Krishna murali into custody

  • సీఐడీ పోలీసుల కస్టడీ వినతిని ఆమోదించిన న్యాయస్థానం
  • గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
  • అనుచిత వ్యాఖ్యల కేసులో విచారించనున్న అధికారులు

సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని తమ కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ పోలీసుల విజ్ఞప్తికి గుంటూరు సివిల్ కోర్టు ఆమోదం తెలిపింది. పోసానిని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం సీఐడీ పోలీసులు పోసానిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత పోసానిని గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తామని, అనంతరం తమ కార్యాలయంలో విచారిస్తామని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లపై పోసాని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు మార్ఫింగ్‌ చేసిన చిత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా గుంటూరు జిల్లా జైలులో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Posani Krishna Murali
CID Custody
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News