Tamannaah: జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దు: తమన్నా

Dont wait for wonder says Tamannaah

  • మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలన్న తమన్నా
  • స్నేహితులను కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలను షేర్ చేసిన వైనం
  • తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు

ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవలి కాలంలో స్కిన్ షో కు తమన్నా వెనుకాడటం లేదు. 'లస్ట్ స్టోరీ' సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి అందరినీ షాక్ కు గురి చేసింది. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దని... మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలని తమన్నా తెలిపింది. తన స్నేహితులు మనీశ్ మల్హోత్రా, రషా థడానీ, ప్రగ్యా కపూర్ లతో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలను షేర్ చేసింది. బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చేందుకు తమన్నా ప్రయత్నిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News