Andhra Pradesh: మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఒంటిపూట బడుల టైమింగ్స్ లో మార్పు

Half Day School Timings Changed In Andhrapradesh

  • పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి నిర్ణయం
  • పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం పూట తరగతులు
  • మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలన్న మంత్రి 

వేసవి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ లు ఉన్న స్కూళ్లలో అధికారులు మధ్యాహ్నం పూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మొదలవుతుండగా మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష పూర్తవుతోంది. ఆ తర్వాత జవాబు పత్రాలను సీల్ చేసి పరీక్షా కేంద్రం నుంచి పంపిస్తున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.

  • Loading...

More Telugu News