Rohit Sharma: ఫొటోగ్రాఫర్లు, అభిమానులపై రోహిత్ శర్మ అసహనం.. అంతలోనే నవ్వుతూ ఫొటోలు!

Rohit Sharma Loses Cool on Video Journalist at Airport

  • కుటుంబంతో కలిసి రోహిత్ శర్మ మాల్దీవుల పర్యటన
  • ముంబై విమానాశ్రయంలో కూతురు ఫొటో తీసేందుకు మీడియా, ఫ్యాన్స్ ప్రయత్నం
  • కూతురును కారులో కూర్చోబెట్టి ఫొటోలకు రోహిత్ శర్మ ఫోజులు

భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఫొటోగ్రాఫర్లు, అభిమానులపై అసహనం వ్యక్తం చేశాడు. తన కూతురు సమైరా ఫొటోను తీసే ప్రయత్నం చేయగా చిరాకుపడ్డాడు. కాసేపటికి కూల్ అయి ఫొటోలకు ఫోజులిచ్చాడు.

రోహిత్ శర్మ తన కూతురు సమైరాను తీసుకొని కారులోకి ఎక్కేందుకు వెళుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. సమైరా ఫొటోను తీయవద్దని హిట్ మ్యాన్ వారిని వారించాడు. ఆ తర్వాత కూతురును కారులో కూర్చోబెట్టి, ఫొటోగ్రాఫర్లకు, అభిమానులకు నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపు అనంతరం రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి మాల్దీవులలో పర్యటించాడు. మాల్దీవుల నుండి తిరిగి వస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో రోహిత్ శర్మ, కూతురు సమైరా ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ప్రయత్నించారు.

More Telugu News