Delhi Capitals: విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

Delhi Capitals team arrived Visakha for IPL clash with LSG on Mar 24

  • ఈ నెల 22 నుంచి ఐపీఎల్ పోటీలు
  • ఈ నెల 24న విశాఖలో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ జట్టు
  • విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు స్వాగతం పలికిన అభిమానులు

భారత్ లో ఐపీఎల్ మేనియా రాజుకుంటోంది. క్రికెట్ ఎంటర్టయిన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్నాయి.కాగా, యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన తొలి మ్యాచ్ ను విశాఖ వేదికగా ఆడనుంది. ఈ నెల 24న ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు నేడు విశాఖ చేరుకున్నారు. 

ఎయిర్ పోర్టులో ఢిల్లీ జట్టుకు అభిమానులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ బృందం ప్రత్యేక బస్సులో నేరుగా తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయింది.  ఆటగాళ్లకు పటిష్ట భద్రతను కల్పించారు.

  • Loading...

More Telugu News