Ranya Rao: రన్యా రావుతో నేను అధికారికంగా విడిపోలేదు... కానీ!: కన్నడ నటి భర్త

We were seperated in November Ranya Rao husband in court

  • కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామన్న రన్యా రావు భర్త
  • రన్యా రావుతో నవంబర్ నెలలో వివాహమైందన్న జతిన్ హుక్కేరి
  • డిసెంబర్ నుంచి తాము విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపిన భర్త

రన్యా రావు, తాను అధికారికంగా విడిపోలేదని, కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు తెలిపారు. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యా రావు పట్టుబడిన విషయ తెలిసిందే.

స్మగ్లింగ్ కేసులో అరెస్టు నుంచి మినహాయించాలని కోరుతూ వేసిన పిటిషన్‌లో భాగంగా ఈ విషయాన్ని హుక్కేరి వెల్లడించారు. రన్యా రావుతో తనకు గత నవంబర్ నెలలో వివాహమైందని, కానీ డిసెంబర్ నుంచి తాము విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపారు.

హుక్కేరి వేసిన పిటిషన్‌పై గతవారం విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24వ తేదీ వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. హుక్కేరి ప్రస్తుతం చేసిన అభ్యర్థనకు వ్యతిరేకంగా తాము పిటిషన్ వేస్తామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News