YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం

YV Subba Reddy mother passes away

  • వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం
  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన యర్రం పిచ్చమ్మ
  • రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ నేడు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు.

పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి... తల్లి మరణవార్తతో హుటాహుటీన ఒంగోలు బయల్దేరారు. వైవీ తల్లికి రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్... యర్రం పిచ్చమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. వైఎస్... వైవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News