Mallu Bhatti Vikramarka: పునర్విభజన అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షం... ఆ రెండు పార్టీలు దూరం

- మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం
- హాజరైన సీపీఎం, సీపీఐ, మజ్లిస్ పార్టీల ప్రతినిధులు
- హాజరుకాని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మజ్లిస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కాలేదు.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని, దీంతో పునర్విభజన జరిగితే నష్టం జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పునర్విభజనపై గళమెత్తుతున్నారు.